కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు.. CM రేవంత్ సంతాపం

by Gantepaka Srikanth |

ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు.

కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు.. CM రేవంత్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, 1999లో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తుచేశారు.

1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌ 2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Next Story