విపక్షాల విమర్శలకు వ్యూహాత్మకంగా చెక్.. ఇవాళే అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలలు పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. కలుషిత భోజనం పెడుతున్నారనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ అయింది.

విపక్షాల విమర్శలకు వ్యూహాత్మకంగా చెక్.. ఇవాళే అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలలు పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. కలుషిత భోజనం పెడుతున్నారనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించాలని నిర్ణయించింది. దీంతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్ శాంతికుమారితోపాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు హాస్టళ్లను సందర్శించనున్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పరిస్థితులను అంచనా వేయనున్నారు.

ఇంకా పలు చర్యలు

రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ. 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. హాస్టళ్ల పనితీరును పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ ను సైతం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారాన్ని ఆహారం, మెరుగైన విద్యాబోధనకు గురుకులాల సందర్శన ప్రోగ్రామ్ ను పెట్టుకున్నది. సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు. నెలలో ఒకసారి స్థానిక ఎమ్మెల్యేలు తప్పనిసరిగా తమ పరిధిలోని గురుకులాలకు వెళ్లాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. కలెక్టర్లు సైతం తమ జిల్లాల పరిధిలోని గురుకులాలకు రెగ్యులర్ గా వెళ్లడంతోపాటు ఒక పీరియడ్ బోధన చేయాలని ప్రభుత్వం కండీషన్ పెట్టనున్నట్టు సమాచారం.

ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన వివరాలు ఇలా..


పెంచిన డైట్ చార్జీలు నేటి నుంచే అమలు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్లలో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు చదువుతుండగా.. డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత డైట్ చార్జీలు 40%, పదహారేళ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలు 200% పెరగనున్నాయి. డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపును సైతం నేటి నుంచే అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెంచిన డైట్ చార్జీల వివరాలను ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల, కేజీబీవీ హాస్టల్లో అందరికీ కనిపించే విధంగా ఫ్లెక్సీ ల ద్వారా ప్రదర్శించాలని మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలకు శుక్రవారం ఉన్నతాధికారులు సూచించారు. డైట్ చార్జీల పెంపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారని, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా, కామన్ డైట్ మెనూ, యూనిఫాం ప్రిపరేషన్ ప్రొసీజర్, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్టోరేజ్, కిచెన్, డైనింగ్ ఏరియా మెయింటెనెన్స్ కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు.

డైట్ చార్జీల పెంపు ఇలా..


రాష్ట్ర వ్యాప్తంగా 3,943 పాఠశాలలు ఉండగా.. వీటిలో రెసిడెన్షియల్ పాఠశాలలు 1025, ఆశ్రమ పాఠశాలలు 323, కేజీబీవీలు 495, సంక్షేమ హాస్టళ్లు 2,100 గా ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి పీజీ వరకు సుమారు ఎనిమిది లక్షల మంది ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్నారు. పెంచిన డైట్ చార్జీలతో వీరికి లబ్ధి చేకూరనుంది.

Next Story