మేడారంలో పైలాన్ ప్రారంభించిన సీఎం, మంత్రులు

by Ratna Kumari |   (  Updated:2026-01-19 07:09:38  IST  )

మేడారంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ ఆల‌యానికి చేరుకొని నూతనంగా నిర్మించిన పైలాన్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల‌తో క‌లిసి ప్రారంభించారు.

మేడారంలో పైలాన్ ప్రారంభించిన సీఎం, మంత్రులు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మేడారంలో స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ ఆల‌యానికి చేరుకొని నూతనంగా నిర్మించిన పైలాన్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఆయ‌న‌తో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క, మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, అడ్లూరు ల‌క్ష్మ‌ణ్, సీత‌క్క‌, కొండా సురేఖ‌, ఎంపీ బ‌లరాం నాయ‌క్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అభివృద్ధి ప‌నులు పూర్తి కాగానే సీఎం కుటుంబ స‌మేతంగా మేడారం స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. ఎత్తుబెల్లం స‌మ‌ర్పించారు. మేడారం నుంచి హెలికాప్ట‌ర్ లో హైద‌రాబాద్ లో బ‌య‌లుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్ర‌యం చేరుకొని దావోస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మేడారంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసారు.

Read More..

Kavihta: ఈ రెండేళ్లలో ఏం సాధించారో శ్వేతపత్రం ఇవ్వండి... సీఎం దావోస్ పర్యటనపై కవిత

Next Story