సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్‌ రెడ్డి రాజీనామా.. ఆమోదించిన సీఎస్ రామకృష్ణా రావు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-05 07:18:35  IST  )

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్‌ రెడ్డి రాజీనామా.. ఆమోదించిన సీఎస్ రామకృష్ణా రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేందర్‌రెడ్డి (Vem Narender Reddy) తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి లాభదాయక పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వేం నరేందర్‌రెడ్డి తన సలహాదారు పదవిని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆయన రాజీనామాను సైతం సీఎస్ రామకృష్ణా రావు (CS Ramakrishna Rao) వెనువెంటనే ఆమోదించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు.

Next Story