కాంగ్రెస్ అంటేనే కరెంట్.. పిచ్చోడా.. KCRపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్

by Sathputhe Rajesh |

కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే కరెంటు రాదంటున్నారని మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.

కాంగ్రెస్ అంటేనే కరెంట్.. పిచ్చోడా.. KCRపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే కరెంటు రాదంటున్నారని, కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్.. పిచ్చొడా..? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కరెంటును ముట్టుకున్న కాంగ్రెస్‌ను ముట్టుకున్న కేసీఆర్ మాడి మసైపోతాడని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మధిర మండలంలో రోడ్ షోలో ఆయన మాట్లాడారు.

ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేనని, ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్రాజెక్టుల వల్లనే కరెంటు అందుతున్నదని తెలిపారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీనే రైతు రుణ మాఫీ చేసిందని, రైతులకు మేం చాలా మేలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయంలో రైతులకు అందే ఎన్నో సబ్సిడీలు కేసీఆర్ రద్దు చేశారని, రైతులను.. కౌలు రైతులను రైతు కూలీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story