TG: ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు క్లియర్

by Gantepaka Srikanth |

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

TG: ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు క్లియర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2764 మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు రూ.28.50 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. దీంతో 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజా ప్రాలన ప్రగతి ప్రణాళికలో మొదటి వారం రోజుల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఎండీ తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పరిశీలించి క్లియర్ చేశామని ఆయన వివరించారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గతవారం రోజుల్లో క్లియర్ చేసిన బిల్లులలో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి సంబంధించి రూ.12.06 కోట్ల విడుదల, బిల్లులు విడుదలైనప్పటికీ వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమెంట్ ఫెయిల్ 653 మంది లబ్ధిదారులకు చెందిన రూ.7 కోట్ల మేర మొత్తాన్ని విడుదల చేసినట్లు మేనేజింగ్ డైరక్టర్ వివరించారు. వీటితో పాటు పలు అభ్యంతరాలు, నిశిత పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్న మరో 911 మంది లబ్ధిదారులకు రూ.9.40 కోట్లను కూడా విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Next Story