ప్రశాంతంగా టెట్ మొదటి రోజు పరీక్ష

by Yella Dhawani Reddy |

టీజీ టెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ప్రశాంతంగా టెట్ మొదటి రోజు పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ టెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన మొదటి రోజు పరీక్షకు మార్నింగ్ సెషన్‌కు 53 పరీక్షా కేంద్రాల్లో 13,131 మంది అభ్యర్థుల్లో 9513 మంది అభ్యర్థులు(72.45 శాతం) హాజరైనట్లు టీజీ సెట్ కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సెషన్‌కు 54 పరీక్షా కేంద్రాల్లో 13,230 విద్యార్థులకు 9605 మంది విద్యార్థులు (72.6 శాతం) హాజరయ్యారు. నేడు 52 సెంటర్లలో మార్నింగ్, 50 సెంటర్లలో మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి.

Next Story