గాంధీభవన్‌లో మలక్ పేట్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-26 10:39:26  IST  )

గాంధీభ‌వ‌న్‌లో మలక్‌పేట్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్‌పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది.

గాంధీభవన్‌లో మలక్ పేట్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ
X

దిశ‌, వెబ్ డెస్క్: గాంధీభ‌వ‌న్‌లో మలక్‌పేట్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్‌పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ డీసీసీ పదవి కావాలని కోరడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. గాంధీభవన్‌లోనే ఇరు వర్గాలు గొడవకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కూడా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపడం, గొడవలు పడటంతో అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సొంతపార్టీ నేతలు సూచిస్తున్నారు.

Next Story