- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గంగలూరు - తోడ్కా మధ్య అడవుల్లో గంగలూరు ఏరియా కమిటీ ఏసీఎం దినేష్‌తోపాటు మరికొందరు మావోయిస్టులు సమావేశమై ఉన్నట్టు తెలిసిన సమాచారం మేరకు పోలీసులు మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో మెరుపు దాడిచేశారు. వీరిని గమనించిన మావోయిస్టులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించిన పోలీసులు ఓ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
Next Story






