- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ, ఎంఐఎం మధ్య వందేమాతరం దుమారం.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రచ్చ రచ్చ
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు టేబుల్స్ పై ఎక్కి ఆందోళనకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. వివిధ అంశాలపై పార్టీల సభ్యుల మధ్య గొడవ జరిగింది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సమయంలో కొంత మంది ఎంఐఎం సభ్యులు కుర్చీలో నుంచి లేవకపోవడం పట్ల బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వందే మాతరం పాడితేనే దేశంలో ఉండాలని కొంత మంది బీజేపీ కార్పొరేటర్లు చెప్పడంతో ఎంఐఎం సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టెబుల్స్ పై ఎక్కి ఆందోళన చేపట్టడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. మార్షల్స్ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఎమ్మెల్యేలు కాదు కార్పొరేటర్లు మాట్లాడాలి:
హైదరాబాద్ ల్యాండ్ ట్రాఫన్స్ ఫర్మేషన్ పాలసీపై ఈ సమావేశంలో గొడవ జరిగింది. హెచ్ఐఎల్ టీ పాలసీ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసనకు దిగింది. మేయర్ పోడియంవ వద్ద ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో సభను 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. అనంతరం సభ ప్రారంభమయ్యాక ఈ పాలసీ విషయంలో చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‍లో ఉన్న పారిశ్రామిక భూములను అప్పనంగా అప్పజెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇది సరికాదన్నారు. ఈ భూముల సమస్య జీహెచ్ఎంసీ పరిధిలోని అందరికి సంబంధించిన అంశం అని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం రౌడీలమా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో గందరగోళం ఏర్పడటంతో సభ వాయిదా వేశారు మేయర్. వాయిదా అనంతరం సమావేశం ప్రారంభం కాగానే పారిశ్రామిక భూములపై బీఆర్ఎస్ చర్చకు పట్టుపట్టింది. దీంతో మాట్లాడాల్సింది ఎమ్మెల్యేలు కాదు కార్పొరేటర్లు మాట్లాడాలంటూ బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశఁ ఇవ్వనని అన్నారు.






