- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమే: మావోయిస్టు వికాస్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) ఎదుట ముగ్గురు మావోయిస్టు పార్టీ(Maoist Party) కీలక నేతలు లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) ఎదుట ముగ్గురు మావోయిస్టు పార్టీ(Maoist Party) కీలక నేతలు లొంగిపోయారు. వారిలో కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్(Maoist Vikas), మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ ఉన్నారు. అయితే.. లొంగుబాటు అనంతరం మావోయిస్టు వికాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని కుండబద్దలు కొట్టారు. మావోయిస్టు అగ్రనేతల మధ్య విభేదాలు మొదలయ్యాయని అన్నారు. ఆయుధాలు వదిలిపెట్టాలనే అంశంపైనే దండకారణ్యంలో విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. ఇదేం కొత్త కాదని.. మావోయిస్టుల్లో ఆధిపత్య పోరు సహజమే అని స్పష్టం చేశారు. అంతకుముందు డీజీపీ శిశధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టులు పంతానికి పోకుండా లొంగిపోవాలని సూచించారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు సంబంధించిన వారు మొత్తం 72 మంది ఉన్నారు.. ఇందులో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు అని వెల్లడించారు. అందరూ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ముగ్గురి వివరాలు






