- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవ్ జీని కూడా ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు: పౌర హక్కుల సంఘం నేతలు
దేవ్ జీని కూడా ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు: పౌర హక్కుల సంఘం నేతలు

దిశ, వెబ్‌డెస్క్: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్(Maredumilli Encounter)పై పౌర హక్కుల సంఘం నేత చంద్రశేఖర్ స్పందించారు. హిడ్మా(Maoist Hidma) ఎన్‌కౌంటర్ బూటకం అని ఫైర్ అయ్యారు. ఇంతటితో ఆగరు అని.. త్వరలోనే దేవ్ జీని కూడా ఎన్‌కౌంటర్ చేయబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తక్షణమే అరెస్ట్ చేసిన మావోయిస్టులను, వారి సానుభూతిపరులను మీడియా ముందు హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను అందరినీ చంపే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 24 గంటల్లో అరెస్ట్ చేసిన అందరినీ కోర్టులో హాజరు పర్చాలని అన్నారు.
కాగా, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ ఉన్నారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చిన నేపథ్యంలో మార్చురీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.






