- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సదరన్ కమాండ్ సెంటర్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్‍కు మార్చండి: సీఎం రేవంత్ రెడ్డి
పదేళ్లలో తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా ఇవ్వలేదని సీఎం అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని (Southern Command Control Centre) హైదరాబాద్ కు మార్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 'సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్' (Civil Military Liaison Conference) జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా(తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్), డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరైన ఈ మీటింగ్‍లో భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూసమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ప్రధాన చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణతరపున విజ్ఞప్తులను ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. పదేళ్లలో పలు రాష్ట్రాల్లో 2-4 సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ లో లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కు 3 వేల ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు.






