Encounter: మారేడుమిల్లి ఎన్ కౌంటర్.. చంద్రబాబుపై పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

మావోయిస్టుల విషయంలో చంద్రబాబుపై పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Encounter: మారేడుమిల్లి ఎన్ కౌంటర్.. చంద్రబాబుపై పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో (Maredumilli Encounter) జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం (civil liberties committee) నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి అరాచకత్వానికి పోటీ పెట్టి జూదం ఆడుతున్నదని పేద ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని ఎప్పటిలాగే పోలీసులే చంపేసి ఎన్ కౌంటర్ కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. ఈ బూటకపు ఎన్ కౌంటర్ల పర్వాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, 2004 నాటి చర్చల కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ తో పాటు ఏవోబీ స్పెషళ్ జోనల్ కమిటీ సభ్యులు అరుణ, అంజు మృతి చెందిన ఘటనపై ఇవాళ ఉప్పల్ లో పౌరహక్కుల సఘం మీడియా సమావేశం నిర్వహించింది. తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, ప్రొఫెసర్ హరగోపాల్ (Prof. Haragopal), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, ప్రొ. హరగోపాల్ తో పాటు సంఘం పలువురు నేతలు ఈ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఇకపైనా ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్నహత్యాకాండలను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ వెంటకే ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పోలిస్ క్యాంపులను ఎత్తివేసి, మిలిటరీ బలగాలను వెంటనే ఉపసంహరించాలన్నారు.

చంద్రబాబు మావోయిస్టులపై ప్రతీకారం:

చంద్రబాబు మావోయిస్టుల పట్ల ప్రతీకారం తీర్చుకుంటున్నారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు. గత నెలలో మావోస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఛత్తీస్ గఢ్ లో చనిపోయేతే ఆయన శవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లోకి రానివ్వకుండా చంద్రబాబు (Chandrababu Naidu) అడ్డుపడ్డారని ఆరోపించారు. చట్టాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఆయన కుటుంబీకులను అవమానపరిచారని శవాలపై సైతం పగతో కక్ష తీర్చుకున్న ఘటనగా ఇది ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ధ్వజమెత్తారు. శవాలకు కూడా హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెబుతుంటే న్యాయస్థానాలు తమకు పట్టనట్లుగా మిన్నకుండిపోయతున్నాయని ఫలితంగా ప్రభఉత్వాలు ఇష్టారీతిగా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రేహౌండ్స్ బలగాలను ఇప్పటికే ఉపయోగిస్తున్నదని ఫైర్ అయ్యారు. దండకారణ్యంలో ఇప్పటి వరకు 550 మందిని చంపేశారు అందులో మూడో వంతు ఆదివాసీలే ఉన్నారని చెప్పారు. వనరులను కార్పొరేట్లకు ధారాధత్తం చేయాలనే లక్ష్యంతో ప్రశ్నిస్తున్న వారిని, వారి ప్రయత్నానికి అరడ్డుపడిన మావోయిస్టులను ఆదివాసీలను విచక్షణారహితంగా చంపేస్తున్నారని మండిపడ్డారు.

Next Story