- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పౌరులకు భద్రత కావాలి.. భయం కాదు: ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ (Hyderbad) మహానగరంలో క్షిణిస్తోన్న శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderbad) మహానగరంలో క్షిణిస్తోన్న శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఇవాళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ మహానగర పరిధిలోన రెండు దారుణమైన నేరాలు జరిగాయని తెలిపారు. పట్టపగలే ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు. ఇక కూకట్‌పల్లి పరిధిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురికావడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హయాంలో పెరుగుతున్న నేరాల రేటు ప్రజల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తోందని కామెంట్ చేశారు. పౌరులకు భయం కాదు.. రక్షణ కావాలని అన్నారు. తెలంగాణ పోలీసులను రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఉపయోగించడం, శాంతిభద్రతలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపకపోవడం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.






