- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమగ్ర కుటుంబసర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ లేఖ
2014లో BRS ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir ali) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: 2014లో BRS ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సర్వేలో జరిగిన అక్రమాలపై CB CID విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేఖ రాశారు. సర్వే కోసం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని లేఖలో ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రజల ఆధార్ నంబర్లు, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం, ఎల్‌పీజీ కనెక్షన్లు, వాహన రిజిస్ట్రేషన్ల సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన 94 అంశాల సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించారు. అయితే, BRS సుమారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, ఈ సర్వేకు సంబంధించిన గణాంకాలను అధికారికంగా విడుదల చేయలేదని ఆయన అన్నారు. ఈక్రమంలో తెలంగాణ ప్రజల సున్నితమైన సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించిన అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు పౌరుల డేటాను ఇతరులకు బదిలీ చేసి ఉంటారని, దీనిపై దర్యాప్తు జరిపితే అన్ని వివరాలు బయటకు వస్తాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.






