- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే ఎన్నికల్లో 80 సీట్లతో రేవంత్ రెడ్డి సీఎం అవుతారు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
తెలంగాణ వచ్చినప్పుడు, మీరు దిగిపోయినప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితి పైన కేటీఆర్ విదేశాల్లో స్పీచ్ లు ఇవ్వాలని, విదేశాల్లో ప్రసంగాలు దంచేముందు పదేళ్లు మీరు చేసిన దోపిడి, అకృత్యాలు, నియంత పాలన పైన ముందు క్షమాపణ చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వచ్చినప్పుడు, మీరు దిగిపోయినప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితి పైన కేటీఆర్ విదేశాల్లో స్పీచ్ లు ఇవ్వాలని, విదేశాల్లో ప్రసంగాలు దంచేముందు పదేళ్లు మీరు చేసిన దోపిడి, అకృత్యాలు, నియంత పాలన పైన ముందు క్షమాపణ చెప్పాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ప్రసంగాలు చూసి జనం నవ్వుకుంటున్నారని, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని, రాష్ట్రంలో చెపుతున్న అబద్దాలు సరిపోలేదని మలేషియా వెళ్లి అబద్దాలు చెపుతున్నారని మేడిపల్లి సత్యం మండిపడ్డారు. తెలంగాణ లో బీఆర్ఎస్ అవసరం లేదని ప్రజలు ఇప్పటికే పలు సార్లు సంకేతాలు ఇచ్చారని, ప్రతిపక్షంగా ఫైయిల్ కావడంతో పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తుక్కు తుక్కు ఓడించారని, అయినా బుద్ది రావడం లేదని ఆయన చరుకులు అంటించారు. డబ్బు మదంతో ఏమైనా చేస్తామన్న అహంకారంతో దేశాలు తిరిగి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీరెన్ని దేశాలు తిరిగినా తెలంగాణ ప్రజల గుండెల్లో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో 80 సీట్లకు పైగా సాధించి రేవంత్ రెడ్డి సీఎం అవుతారని, కేటీఆర్ కు దమ్ముంటే చేతనైతే ఆపాలని, ప్రతిపక్ష హోదా కూడా ఈ సారి బీఆర్ఎస్ కు రాదన్నారు. తెలంగాణ ప్రజలను వానపాముల్లా చూశారని, కానీ, అవే వానపాములు బుసలు కొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయని మేడిపల్లి సత్యం అన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్వంతులు.. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవాన్ని వదులుకోలేరని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఎప్పటికి క్షమించరన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను చూసి ఛీదరించుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అభ్యర్థులు కూడా దొరకరని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు.
మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీని పరామర్శించిన మేడిపల్లి సత్యం...
అనారోగ్యంతో హైదరాబాద్ లోని కొంపల్లి లోని ఓ ప్రయివేట్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. సత్యంను చూసి దేవ్ జీ ఆత్మీయంగా పలకరించారు. దేవ్ జీ యోగక్షేమాలు మేడిపల్లి సత్యం తెలుసుకున్నారు. అరగంటకు పైగా దేవ్ జీతో మేడిపల్లి సత్యం మాట్లాడారు. విప్లవోద్యమ అనుభవాలను మేడిపల్లి సత్యంతో దేవ్ జీ పంచుకున్నారు. కాగా, ఇటీవల లాసెట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించిన దేవ్ జీ ని మేడిపల్లి సత్యం అభినందించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ తమ జిల్లాకు చెందిన నాయకుడని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందుకే పరామర్శించి వచ్చినట్లుగా తెలిపారు.






