- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi: అల్లు అర్జున్ ఇంటి నుంచి వెళ్లిపోయిన చిరంజీవి.. కారణం ఇదే!
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హుటాహుటిన అల్లు అరవింద్(Allu Arvind) ఇంటికి వచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హుటాహుటిన అల్లు అరవింద్(Allu Arvind) ఇంటికి వచ్చారు. అరెస్ట్‌కు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉండి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. లాయర్‌లు, పోలీసులతో టచ్‌లో ఉండి పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అరెస్ట్ తర్వాత నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు ప్రవేశ పెట్టారు.
ఇరు పక్షాలు వాదనలను వినిపించారు. వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించారు. దీనితో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. అభిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.






