- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే పోలింగ్.. చిరు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఓటు వేసేది ఇక్కడే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో ఓటు వినియోగించుకునేందుకు జనం గ్రామాలకు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో ఓటు వినియోగించుకునేందుకు జనం గ్రామాలకు తరలి వెళ్తున్నారు. విదేశాల్లో ఉన్న సెలబ్రెటీలు సైతం ఓటు వేసేందుకు ఇక్కడికి బయలుదేరారు. ఇక, హైదరాబాద్‌లోని ఫిల్మింనగర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో ఎక్కువగా ఉండే సినీ సెలబ్రెటీస్ ఆయా నియోజకవర్గా్ల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమా షూటింగ్ నిమిత్తం మైసూర్‌లో ఉన్న రామ్ చరణ్ సైతం ఇవాళ హైదరాబాద్‌కు బయలుదేరారు.
జూబ్లీహిల్స్ క్లబ్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ 149లో మెగస్టార్ చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్ ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ 165లో మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మీ, మనోజ్ ఓటు హక్కు వినియోగించుకోన్నారు. జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఓటు వేయనున్నారు. మణికొండ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో స్టార్ హీరో ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం తదితర సెలబ్రెటీలు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.






