డిప్యూటీ CM ఇంట్లో చిరంజీవి, నాగార్జున

by Gantepaka Srikanth |

డిప్యూటీ CM ఇంట్లో చిరంజీవి, నాగార్జున

డిప్యూటీ CM ఇంట్లో చిరంజీవి, నాగార్జున
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అక్కినేని నాగార్జున(Nagarjuna) హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు వచ్చారు. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించింది, మా విజన్‌ డాక్యుమెంట్‌ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్‌ సమ్మిట్ వివరాలను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. ‘‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో 27 సెషన్లు ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను సమిట్‌కు ఆహ్వానించాం. ఎయిర్‌లైన్స్‌ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. సమిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వస్తారు. ముఖ్యఅతిథులకు సమస్య వస్తే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం. ఇలాంటి సమిట్ గతంలో ఎప్పుడూ జరగలేదు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

Next Story