- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rudra: యువతకు మార్గదర్శకం ‘రుద్ర’.. గ్రంథాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
‘రుద్ర’ గ్రంథాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. శివ పురాణంపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ‘రుద్ర’ పుస్తకాన్ని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ రచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రుద్ర’ గ్రంథాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. శివ పురాణంపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ‘రుద్ర’ పుస్తకాన్ని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ రచించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా మంత్రి కొండా సురేఖ వివరాలు పోస్ట్ చేశారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచేలా, శివ పురాణంపై అవగాహన కలిగించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించిన కొండా సుస్మితాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి విలువైన పుస్తకాన్ని నేటి యువతరానికి అందించడం నిజంగా ప్రశంసనీయం అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని గొప్ప రచనలను అందించాలని ఆకాంక్షించారు. "రుద్ర" పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పుస్తక ఆవిష్కరణపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా పుస్తకం రూపొందించడం చాలా సంతోషం అని మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు. నేటి తరానికి ఇలాంటి విలువైన గ్రంథాలు అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.






