- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితకు కేసీఆర్ గ్రామస్తుల ఆహ్వానం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు రావాలని ఆహ్వానం అందింది. చింతమడకలో ఈనెల 21న జరగబోయే ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు రావాలని కొంతమంది గ్రామస్తులు వచ్చిన కవితను ఆహ్వానించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు రావాలని ఆహ్వానం అందింది. చింతమడకలో ఈనెల 21న జరగబోయే ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు రావాలని కొంతమంది గ్రామస్తులు వచ్చిన కవితను ఆహ్వానించారు. కేసీఆర్ స్వగ్రామం నుండి కవితకు ఆహ్వానం అందడం ఆసక్తికరంగా మారింది. కవితను బీఆర్ఎస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే.
చాలా కాలంగా కవిత పార్టీకి దూరంగా ఉండటంతో పాటు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేశారు. వాళ్లిద్దరూ తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ తరవాత బీఆర్ఎస్ నుండి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే గతంలో బతుకమ్మ ఉత్సవాల్లో జాగృతి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బతుకమ్మ ఉత్సవాల సమయంలో కవిత అనేక ప్రాంతాలకు వెళ్లి మహిళలతో కలిసి ఆడేవారు. ప్రస్తుతం ఆ పార్టీలో లేనప్పటికీ కేసీఆర్ స్వగ్రామంలో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది.






