- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chintal: విద్యార్థులకు రక్తపు వాంతుల కలకలం.. 15 మంది విద్యార్థులకు అస్వస్తత
శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School)లో విద్యార్థులకు(Students) రక్తపు వాంతులు(Blood Vomiting) కలకలం రేపాయి.

దిశ, వెబ్ డెస్క్: శ్రీ చైతన్య పాఠశాల(Sri Chaitanya School)లో విద్యార్థులకు(Students) రక్తపు వాంతులు(Blood Vomiting) కలకలం రేపాయి. చింతల్(Chinthal)లోని శ్రీ చైతన్య పాఠశాలలో కింద పడిన యాసిడ్(Acid) ను శుభ్రం చేయడంలో స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతో యాసిడ్ ఘాటు భరించలేక విద్యార్థులు అస్వస్థత(Illness)కు గురయ్యారు. విద్యార్ధులకు రక్తపు వాంతులు కావడంతో పాఠశాల యాజమాన్యం వారిని ఆసుపత్రిలో చేర్పించారు. యాసిడ్ ఘాటుతో 15 మంది విద్యార్థుల అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీనిపై పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వలేదని, పిల్లలను ఆసుపత్రిలో చికిత్స అందించి, తీసుకొచ్చే వరకు తమకు తెలియదని ఆందోళనకు దిగారు. సిబ్బంది తమ పిల్లలకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా? అని, పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






