- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాజ్యసభ సీటు ఇవ్వండి’.. ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ
ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను చిన్నారెడ్డి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ 70 శాతం స్థానాలను, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించిందని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఇతర ఏ ఎన్నికలు వచ్చిన కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఖర్గేకు చిన్నారెడ్డి వివరించారు.
రాజ్యసభ సీటు ఇవ్వండి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని ఖర్గే అభినందించారని ఆయన తెలిపారు. రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ-ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీనిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ దృష్టికి తెచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.






