ఏడాది చివరలో సమతామూర్తి వార్షికోత్సవ వేడుకలు.. ప్రధాని మోడీకి ఆహ్వానం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-31 14:50:11  IST  )

ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ‌ వార్షికోత్సవ ముగింపు వేడుక‌ల‌ను ఈ ఏడాది చివ‌ర‌లో నిర్వ‌హించ‌నున్నారు.

ఏడాది చివరలో సమతామూర్తి వార్షికోత్సవ వేడుకలు.. ప్రధాని మోడీకి ఆహ్వానం
X

దిశ‌, వెబ్ డెస్క్: ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ‌ వార్షికోత్సవ ముగింపు వేడుక‌ల‌ను ఈ ఏడాది చివ‌ర‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు విశిష్ఠ అతిథిగా హాజ‌ర‌వ్వాల‌ని ప్ర‌ధాని మోడీని ఆద్యాత్మిక గురువు త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి, హైహోమ్ గ్రూప్ చైర్మ‌న్ రామేశ్వ‌ర‌రావు, వైస్ చైర్మ‌న్ ఆహ్వానించారు. ఢిల్లీలోని ప్ర‌ధాని నివాసానికి వెళ్లి ఆహ్వ‌నించ‌గా ఆయ‌న సాకుకూలంగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానికి స‌మతా మూర్తి స్పూర్తి కేంద్రం విశేషాల‌ను వివ‌రించారు.

స‌మ‌తామూర్తి కేంద్రం ప్రాంగ‌ణంలో ఉన్న 108 దివ్య దేశాల‌లో కొలువుదీరిన దేవ‌తామూర్తుల‌కు జ‌రిగే నిత్య కైంక‌ర్యాల‌ను తెలియ‌జేశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయ‌ర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న నేత్ర విద్యాల‌యం, ఆయుర్వేద‌- హెమియో క‌ళాశాల‌ పురోగతి గురించి ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా. రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావుల‌ను అభినందించారు.

Next Story