మీడియా అధినేతతో పాటు మంత్రులు చనిపోతారు.. చిలుకూరి శ్రీనివాసమూర్తి సంచలన పంచాంగం

by Disha Web Desk 2 |
మీడియా అధినేతతో పాటు మంత్రులు చనిపోతారు.. చిలుకూరి శ్రీనివాసమూర్తి సంచలన పంచాంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది అనారోగ్యంతో ఓ మీడియా అధినేత చనిపోతారని చిలుకూరి శ్రీనివాసమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన మంగళవారం గాంధీభవన్‌లో పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ సంవత్సరంలో మంత్రుల మరణాలు సంభవిస్తాయని హాట్ కామెంట్లు చేశారు. అంతేగాక సినిమా, రాజకీయ వర్గాల్లోని అక్రమ సంబంధాలన్నీ బయట పడతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇవి జరుగుతాయన్నారు. యూనివర్సిటీల్లో అవకతవకలు, పేపర్ లీకులు జరుగుతాయన్నారు. భూ కబ్జాలు బయటపడి, రాజకీయ నేతలు శిక్షలు అనుభవిస్తారన్నారు. ప్రస్తుతం పత్రికల్లో అబద్దపు వార్తలు పెరిగాయని, భవిష్యత్‌లో మితిమీరిపోతాయన్నారు. హింసా, పాన్ సినిమా దర్శకులకు నిరాశే ఎదురవుతుందన్నారు. కుటుంబ సమేతంగా వీక్షించే మంచి సినిమాలు రావన్నారు. అశ్లీల, వాణిజ్యపరమైన సినిమాలు మాత్రమే వస్తాయన్నారు. వైద్యారోగ్యంలోనూ అస్తవ్యస్థ పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందన్నారు. కలుషిత ఆహారం వలన ప్రజలు అనారోగ్య బాట పడతారన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెరగడమే కాకుండా, కిడ్నీ సమస్యల పేషెంట్లు కూడా ఎక్కువ అవుతారన్నారు.

రేవంత్ రెడ్డి విశ్వరూపం..?

గతేడాది అక్టోబరు నుంచి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపించారన్నారు. ప్రతిపక్ష హోదాలోనే గత సర్కార్‌ను ముచ్చెమటలు పట్టించారన్నారు. పరుశురాముడిలాగా పనిచేశారన్నారు. సమిష్టి కృషితోనే రాష్ట్రంలో పవర్ పొందారన్నారు. రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉన్నదన్నారు. ఈ క్రోది నామ సంవత్సరంలో మరింత వేగంగా పనిచేస్తారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవీ బాధ్యతలు చేపట్టాక, అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిందన్నారు. ఇది మంచి శుభ పరిణామం అన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్నారు. అధికారంలోని పార్టీ కేంద్రంలోనూ పవర్ పొందుతుందన్నారు. 350 నుంచి 400 సీట్లు వస్తాయన్నారు.

ప్రతిపక్షం మరింత వీక్..?

రాష్ట్రంలో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందన్నారు. అధికార పార్టీ బలపడుతూ, ప్రతిపక్షాన్ని చీల్చుతుందన్నారు. అధికార పార్టీ కొత్త చట్టాలను తీసుకువస్తుందన్నారు. ఇక బ్యాంకింగ్ సెక్టార్స్ ముందంజలో ఉండనుండగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం అవుతాయన్నారు. వడగాలులు, అత్యధిక ఉష్టోగ్రతలు నమోదవుతాయన్నారు. జాతీయ రహదారులు, విమాన, ఇంఫ్రాక్ట్రక్చర్ డెవలప్ అవుతుందన్నారు. ఇతర దేశాలపై ఆధిపత్యం పెరుగుతుందన్నారు. పీవీసీ వాడకం గణనీయంగా పెరుగుతుందన్నారు. గంజాయి, మత్తు వినియోగం పెరుగుతుందన్నారు. ఆయుర్వేద ఉత్పత్తులపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. స్టాక్ మార్కెట్ లో ఎచ్చుతగ్గులు ఉంటాయన్నారు. రక్షణ శాఖలో ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు , సుప్రీం కోర్టులో అన్యుహ మార్పులు సంభవిస్తాయన్నారు. కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు దూరమవుతారన్నారు.

ఆగస్టు, సెప్టెంబరులో మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉన్నదన్నారు. ఈడీ, సీబీఐ సంస్థలను రాజకీయ నేతలు మరింత దుర్వినియోగ పరుస్తారన్నారు.గాంధీ భవన్ లో జరిగిన క్రోది నామ సంవత్సర ఉగాది వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్ రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed