- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన చిలుకానగర్ కార్పొరేటర్ భర్త (వీడియో)
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో చిలుకానగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్‌ను మరో పార్టీ నాయకులు

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో చిలుకానగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్‌ను మరో పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని నిలదీశారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడి నుండి వెళ్లిపోవాలని బన్నాల ప్రవీణ్‌ను పక్క పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా, మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాయకులు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని ప్రలోభ పెడుతున్నారు.
Next Story






