- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam Prabhakar : పాఠశాలల్లో చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లు : మంత్రి పొన్నం
రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పాఠశాల(Schools)ల్లో చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్(Children's Road Safety Awareness Parks) లు ఏర్పాటు చేసేందుకు నూతనంగా నియమితులైన ఆర్టీఏ(RTA) నాన్ ఆఫీషియల్ సభ్యులు(Non-Official Members) కృషి చేయాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)సూచించారు.

దిశ, వెబ్ డెస్క్ : రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పాఠశాల(Schools)ల్లో చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్(Children's Road Safety Awareness Parks) లు ఏర్పాటు చేసేందుకు నూతనంగా నియమితులైన ఆర్టీఏ(RTA) నాన్ ఆఫీషియల్ సభ్యులు(Non-Official Members) కృషి చేయాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)సూచించారు. నూతనంగా నియమితులైన ఆర్టీఏ (నాన్ ఆఫీషియల్) సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. వారితో సమాచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాజకీయాల్లో ఏదైనా బాధ్యత వచ్చినప్పుడు ప్రజలు జ్ఞాపకం ఉంచుకునేలా పని చేయాలని సూచించారు. రవాణా శాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలి..సంస్ధకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
రాష్ట్రంలో 63 రవాణా శాఖ కార్యాలయాల్లో 31 కార్యాలయాలకు భవనాలు కట్టాల్సి ఉందని..8 ప్రాంతాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు ఉన్నాయని ఇతర కార్యాలయాల్లో స్థలాల కోసం జిల్లా కలెక్టర్ ,స్థానిక శాసన సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ కేటాయించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సభ్యులు వారానికి రెండు స్కూల్ లలో ట్రాఫిక్ అవేర్నెస్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రవాణా శాఖ అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మొదట హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి ఇచ్చే 5 వేల పారితోషికం వారికి అందేవిధంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్రజల రవాణా పరమైన సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం రవాణా శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు తదితర అంశాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ వివరించారు. రవాణా శాఖ విధులు మోటారు వాహనాల చట్టం రిజిస్టరేషన్ ,పన్ను వసూలు , లైసెన్స్ ,ఫిట్నెస్ , తనిఖీలు ,రోడ్ సేఫ్టీ ,పొల్యూషన్ కంట్రోల్ , మీ సేవా యాప్ (టి యాప్ ) ,ఆర్టీఏ ఎం వాలెట్ , నవంబర్ 16 నుండి అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ ,వెహికిల్ స్క్రాప్ పాలసీ ,TS నుండి TG గా మార్పు , ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ , వాహనాల ట్రాకింగ్ పరికరాలు , ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ , తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి రవాణా శాఖకు లోగో ఏర్పాటు ,రోడ్డు భద్రత రవాణా శాఖ మొదటి ప్రాధానత్య తదితర అంశాలను RTA నాన్ అఫిసియో సభ్యులకు వివరించారు.
గతంలో రోడ్ సేఫ్టీ వీక్ ఉండేదని దానిని జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలలో భాగంగా నెల రోజుల పాటు అమలు చేస్తూ ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి యూనిసెఫ్ సహకారంతో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో గవర్నర్ చేతుల మీదుగా చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా , రవాణా శాఖ అధికారి సభ్య కార్యదర్శిగా ఆర్టీఏ మెంబెర్స్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ , జెటిసి లు శివ లింగయ్య , చంద్రశేఖర్ గౌడ్ , ఆర్టీఏ మెంబెర్స్ పాల్గొన్నారు.






