- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40 రోజులు సెలవులు ఇస్తారా? ఎస్సై అయ్యప్పమాల వివాదంపై చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్
అయ్యప్ప మాల వేసుకున్నందుకు కంచన్ బాగ్ ఎస్సైకి డీఎస్పీ మెమో జారీ చేయడాన్ని హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ తప్పుపట్టారు. సెలవు పెట్టి మాల వేసుకోవాలని చెబుతున్నారు.. 40 రోజుల పాటు పోలీసులకు ప్రభుత్వం సెలవులు ఇస్తుందా అని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: అయ్యప్ప మాల వేసుకున్నందుకు కంచన్ బాగ్ ఎస్సైకి డీఎస్పీ మెమో జారీ చేయడాన్ని హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ తప్పుపట్టారు. సెలవు పెట్టి మాల వేసుకోవాలని చెబుతున్నారు.. 40 రోజుల పాటు పోలీసులకు ప్రభుత్వం సెలవులు ఇస్తుందా అని ప్రశ్నించారు. మెమోలో గడ్డం పెంచవద్దు, సివిల్ డ్రెస్సులో డ్యూటీకి రావద్దు ఉందన్నారు. మాల దారణ చేయాలి అనుకుంటే లీవ్ పెట్టుకోవాలని సూచించారన్నారు. ఎన్నో ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఎలా పక్కన పెడతారని అన్నారు. ఇతర మతస్తుల పండగలు అయితే సెలవులు ఇస్తారని, అలవెన్సులు కూడా ఇస్తూ డ్యూటీ సమయం తగ్గిస్తారన్నారు.
మరి హిందువుల పండుగలకే ఇలాంటి రూల్స్ ఎందుకు పెడతారని ప్రశ్నించారు. హిందువుల, అయ్యప్పస్వాములు రోడ్డుపైకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖలోనే ఇలాంటి తప్పదాలు జరిగితే ఎలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వద్దనే పోలీస్ శాఖ ఉందని.. మీ రివ్యూ మీటింగుల్లో పోలీసులకు చెప్పడం లేదా అని అడిగారు. పోలీసులు మాల వేసుకోవద్దు అనే రూల్ తీసుకువస్తే బాగుండదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని.. హిందూ ద్రోహిగా మిగిలిపోవద్దని అన్నారు.






