చికెన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర

by Naga Rani Yarlagadda |

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో చికెన్ పై ఏకంగా రూ.100 తగ్గింది.

చికెన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర
X

దిశ, వెబ్‌డెస్క్: చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది. వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.270గా ఉండగా.. అటు వరంగల్ లోనూ అదే ధర కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో మాత్రం రూ.300-350 పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారస్తులు తెలిపారు.

Next Story