- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ రెడ్డి సొంత మామకు షాక్.. క్లెయిమ్ రిజెక్ట్ చేసిన ఇన్యూరెన్స్ కంపెనీ!
CM రేవంత్ రెడ్డి సొంత మామకు షాక్.. క్లెయిమ్ రిజెక్ట్ చేసిన ఇన్యూరెన్స్ కంపెనీ!

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్న సామెత లాగా.. ముఖ్యమంత్రికి మామయినా సాధారణ వినియోగదారుడే అని నిరూపించిన వైనమిది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయానా మామ అయిన సూదిని పద్మారెడ్డి నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ తన మెడికల్ క్లెయిమ్ తిరస్కరించడంతో హైదరాబాద్‌లోని రెండో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో నివసించే పద్మారెడ్డి 2024 మే 13న గుండెనొప్పితో మెడికవర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. చికిత్సకు అయిన సొమ్ము 23.50 లక్షలు చెల్లించి నివా బూపా కంపెనీ పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. గత ఐదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ 20 లక్షల పాలసీని రెన్యూవల్ చేయించుకుంటున్నారు. తన మూడో ఏట నుండే పోస్ట్ పోలియో పెరాలసిస్‌తో బాధపడుతున్న పాలసీ దారు క్లెయిమ్‌ను పాలసీ ఇచ్చినప్పుడు అభ్యంతరం చెప్పని నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ తీరా చికిత్స పొంది అయిన ఖర్చు క్లెయిమ్ చేశాక ఆ కారణంతో తిరస్కరించడంతో ఫిర్యాదీ ఫోరాన్ని ఆశ్రయించాడు.
స్వయానా ముఖ్యమంత్రి మామకే ఇలాంటి పరిస్ధితి ఎదురైందంటే సామాన్య వినియోగ దారుల పరిస్థితి ఎలా ఉంటుందో అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. సహేతుకం కాని కారణాలతో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదే రీతిలో వ్వవహరిస్తూ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వినియోదరుల కమిషన్‌లు వినియోగదారులకు ఉపశమనం అందించినా అప్పీలు, పై అప్పీలు అంటూ కాలయాపన చేయడం షరా మామూలైంది. తీర్పు అమలుకు కమిషన్ జారీ చేసే వారంట్లను పోలీసు యంత్రాంగం అమలు చేయక కాలయాపన చేయడం మరొక అడ్డంకిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతంలో సీఎస్, సీఎస్‌సీలు వినియోగదారులే
తెలంగాణ పూర్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమారి, సివిల్ సప్లయి కమిషనర్‌లుగా పనిచేసిన డీఎస్ చౌహాన్ కూడా వినియోగదారుల కమిషన్‌లను ఆశ్రయించారు. శాంతికుమారి మార్నింగ్ వాక్ కోసం కొనుగోలు చేసిన షూస్ విషయంలో హైదరాబాద్ వన్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. చౌహాన్ పోలీసు అధికారి హోదాలో కొనుగోలు చేసిన బోస్ కంపెనీ బ్లూటూత్ పనిచేయకపోవడంతో హైదరాబాద్ టూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.






