CM Revanth: సమ్మర్‌లో విద్యుత్ ఇబ్బందులు ఉండొద్దు

by Gantepaka Srikanth |

వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ఎక్కడా విద్యుత్ అంతరాయం

CM Revanth: సమ్మర్‌లో విద్యుత్ ఇబ్బందులు ఉండొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్‌కు అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా వివిధ ప్రత్యమ్నాయాలను పరిశీలించాలని చెప్పారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.

Next Story