గుర్తుండిపోయేలా కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ (వీడియో)

by Disha Web Desk 2 |
గుర్తుండిపోయేలా కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. శనివారం అసెంబ్లీ వేదికగా ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా, పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా పనిచేసి తనదైన పాత్ర పోషించారు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.. తెలంగాణ పున:నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ వేదికగా సభలో లేని ప్రతిపక్ష నాయకుడికి శుభాకాంక్షలు చెప్పడం శుభపరిణామమని కొనియాడారు.

Next Story

Most Viewed