ప్రధాని మోడీ కులంపై మరోసారి CM రేవంత్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీ కులంపై మరోసారి CM రేవంత్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తాను ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రధాని హోదాను అగౌరవపర్చలేదు. పుట్టుకతోనే ఆయన బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. మోడీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి’ అని డిమాండ్ చేశారు. అంతేకాదు.. తమ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. గ్యాప్ ఉన్నట్లు విపక్ష నేతలే క్రియేట్ చేశారని.. అవన్నీ ఊహాగానాలే అని అన్నారు. రాహుల్ గాంధీ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ ఎజెండాను ముఖ్యమంత్రిగా నెరవేర్చడమే నా పని అని వెల్లడించారు.

‘దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగనన చేశాం. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన చేస్తున్నాం. జనం స్వయంగా చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదు చేశాం. కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించండి’ అని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కి 150 ఇళ్ళు కేటాయించినట్లు చెప్పారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో బీసీలు 51% శాతం, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% శాతం, మిగతావాళ్ళు 'ఓసీ'లుగా చూపారని అన్నారు. తాము చేసిన సర్వేలో మొత్తం 5 కేటగిరీలుగా విభజించి, ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పామని స్పష్టం చేశారు. ఆ ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56% అయ్యారని అన్నారు.

‘42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం. రాజకీయ జోక్యానికి తావులేకుండా కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నాం. కేసీఆర్ సర్వేలో ఎస్సీలు 82 కులాలుగా చూపారు. కానీ ఉన్నవి 59 కులాలే అని చెప్పారు. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా నేను పట్టించుకోను. మోడీ క్యాస్ట్ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే తాను అంగీకరిస్తున్నాను’ అని అన్నారు.

అంతకుముందు సోనియా, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చించలేదని స్పష్టం చేశారు.

Next Story