- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth Reddy: దావోస్ లో రేవంత్ రెడ్డి టీమ్ బిజీ బిజీ..ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్‍తో సీఎం భేటీ
by Prasad Jukanti |
వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృత చర్చ జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణణ రైజింగ్ బృందం మొదటి రోజు బిజీ బిజీగా గడిపింది. ఇవాళ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్ టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఎరో స్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోవడానికి అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






