- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జంతర్‌మంతర్ వద్ద జంగ్‌కు కాంగ్రెస్ సిద్ధం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన శంషాబాద్ (Shamshabad)లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హస్తినకు చేరుకుంటారు. అనంతరం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే ధర్నాలో పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా మొత్తం మూడు రోజుల పాటు కాంగ్రెస్, పలు బీసీ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మరో బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల ముఖ్య నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఈ ఆందోళనలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.






