- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి CM రేవంత్ భారీ శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu) కోసం ఎదురుచూసే పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu) కోసం ఎదురుచూసే పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు. ఆదివారం కేరళ(Kerala)లోని తిరువనంతపురం(Thiruvananthapuram)లో ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని.. అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమని వెల్లడించారు. తెలంగాణను భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 60 ఏళ్ల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో ప్రేమిస్తున్నారని అన్నారు.
ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్(BRS) నేతలు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరి కాకుండా.. దానికి పూర్తి భిన్నంగా అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. దేశంలోని ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ(Future City) నిర్మిస్తున్నాం.. ఇది భారతదేశంలోని పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన (Greenest, Cleanest And Best) నగరంగా ఉండనుంది. ప్రపంచంలోని మరే నగరంతో పోల్చుకున్నా ఇది సరైన ప్రణాళిక, జోన్లు ఉన్న నగరంగా ఉండనుంది. అలాగే ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఫ్యూచర్ సిటీలో మేం AI సిటీని నిర్మిస్తున్నాం.. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నాం.. హైదరాబాద్ పర్యావరణ సుస్థిరతకుగానూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు.
గ్రామాల్లోనూ అత్యుత్తమ వసతులు కల్పిస్తాం.. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తున్నాం... రైతులకు ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇస్తున్నాం.. భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం.. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఇస్తున్నామని అన్నారు. ప్రతీ సంవత్సరం నాలుగు లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. 20 లక్షల పేద కుటుంబాలు సొంత ఇళ్ల కల నెరవేరుతుందని నేను హామీ ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.






