- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy: సొంత నియోజకవర్గంలో రూ.103 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొండంగల్ (Kodangal Constituency) లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కొండగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న ఆర్టీసీ బస్సును సీఎం జెండా ఊపి ప్రారంభించారు. కొడంగల్ మార్కెట్ యార్డ్ లోని HKM బ్రేక్ ఫాస్ట్ కిచెన్ షెడ్ (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్)ను సందర్శించారు. మిడ్ డే మీల్స్ కిచెన్ భవనానికి సీఎం భూమి పూజ చేశారు.
సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు:
రూ. 5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం
రూ. 5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం
రూ. 3 కోట్లతో నియోజకవర్గంలో 10 GP భవనాల నిర్మాణం
రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా మరియు విద్యుదీకరణ)
రూ. 1 కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన
రూ. 1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం.
రూ. 1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం
రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు & కాంపౌండ్ వాల్స్ నిర్మాణం
రూ. 4.45 కోట్లతో సిసి రోడ్లు & భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం
రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు & గ్రంథాలయ భవనాల ప్రారంభం
రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ
రూ. 5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం
రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు






