రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. పాదయత్రలు, కార్నర్ మీటింగ్ లపై దృష్టి సారించి ప్రజా సమస్యలేంటో తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టి పెండిగ్ పనులు లేకుండా చూసుకోవాలన్నారు.

ప్రతియేటా ఏప్రిల్ 27న నిర్వహించే పార్టీ ప్లీనరీ ఇకపై లేదని దాని స్థానంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని తెలిపారు. అదే రోజు వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎక్కడికక్కడ తిప్పికోట్టాలని ముఖ్యంగా బీజేపీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు ఇటీవల మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు.


Next Story

Most Viewed