అల్లు అర్జున్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు

by Disha Web Desk 2 |
అల్లు అర్జున్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపిక అయినందున శనివారం విషెస్ చెబుతూ ప్రకటన విడదల చేశారు. 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయి అవార్డు రావడం గొప్ప విషయమన్నారు. ఇది తెలుగు చలనచిత్ర రంగానికి గర్వకారణం అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాటు జాతీయ అవార్డులు సాధించిన పలు తెలుగు సినిమాలకు అవార్డులు రావడం సంతోషంగా ఉందని అన్నారు.

చిత్రరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తమవంతు కృషి చేస్తున్నామని, ఇక ముందు కూడా మరింత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కాగా, రెండు రోజులక్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆరు అవార్డులు, సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం రెండు అవార్డులు, బుచ్చిబాబు ఉప్పెన, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన కొండపొలం చిత్రాలకు చెరో అవార్డు లభించింది. మొత్తంగా తెలుగు సినిమాలకు పది అవార్డులు దక్కాయి.



Next Story

Most Viewed