ఎగ్జిబిషన్‌లో అటవీశాఖ ప్రత్యేక స్టాల్ ప్రారంభించిన ముఖ్య సంరక్షణాధికారిణి సువర్ణ

by Naga Rani Yarlagadda |

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సందర్శకుల కోసం తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది.

ఎగ్జిబిషన్‌లో అటవీశాఖ ప్రత్యేక స్టాల్ ప్రారంభించిన ముఖ్య సంరక్షణాధికారిణి సువర్ణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సందర్శకుల కోసం తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్ ను అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డా.సి.సువర్ణ, ఐఎఫ్ఎస్ ప్రారంభించారు. అడవుల రక్షణ, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం పరిరక్షణతో పాటు అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ స్టాల్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణి నిర్వహణ, పరిశోధన, సమాజ భాగస్వామ్యం వంటి అంశాలను నమూనాలు, సమాచార ఫలకాల ద్వారా సులభంగా అర్థమయ్యేలా ప్రదర్శిస్తున్నారు.

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ), నెహ్రూ జూలాజికల్ పార్క్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, వెదురు ఉత్పత్తుల విభాగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అటవీ పరిశోధనలు, ఎకో టూరిజం, అటవీ ఆధారిత ఉపాధి అవకాశాలపై సందర్శకులకు వివరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.. ఎఫ్సీఆర్ఐ తయారు చేసిన సహజ తేనె విక్రయం కూడా ప్రజలను ఆకట్టుకుంటోంది. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పక్షుల మినీ జూ, వన్యప్రాణుల ప్రతిరూపాలతో సెల్ఫీ పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అటవీ శాఖ సాధించిన విజయాలపై వీడియో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Next Story