- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్‌ను కలిసిన ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఛత్తీస్ ఘడ్ అధ్యయనం చేస్తున్నది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ స్కీమ్‌ల అమలు తీరును పరిశీలిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఛత్తీస్ ఘడ్ అధ్యయనం చేస్తున్నది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ స్కీమ్‌ల అమలు తీరును పరిశీలిస్తున్నది. స్వయంగా అక్కడి పీసీసీ హైదరాబాద్‌కు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ రాష్ట్రం పీసీసీ అధ్యక్షుడు దీపక్ బైజ్... తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ప్రత్యేకంగా కలిశారు. పార్టీ కార్యక్రమాలపై మహేష్ గౌడ్ ను, ప్రభుత్వ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పై సీఎం రేవంత్ ను అడిగి తెలుసుకున్నారు. పార్టీ సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడంపై చర్చించారు. దీంతో పాటు ఆ రాష్ట్రంలో అధికార పార్టీపై చేయాల్సిన ఒత్తిడి, ప్రజల్లో మైలేజ్ పొందేందుకు పాటించాల్సిన వ్యూహాలపై కూడా వివరాలు సేకరించారు. నేతల మధ్య సమన్వయం, పార్టీని మరింత పటిష్టంగా తయారయ్యేందుకు వ్యవహరించాల్సిన విధానాలపై కూడా చత్తీస్ ఘడ్ పీసీసీ అధ్యక్షుడు ఆరా తీస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటూ సీరియస్ గా స్టడీ చేస్తున్నారు. ఏఐసీసీ ఆదేశం మేరకే ఆయన అధ్యయనం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. ఇక తెలంగాణతో పాటు చత్తీస్ ఘడ్ కు కూడా త్వరలో కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కానున్నది. దీంతో కార్యవర్గం ఎలా ఉండాలి? కమిటీ పరిమితులు, పార్టీ యాక్టివిటీస్, ప్రణాళికలు, సెంట్రల్,స్టేట్ అధికార పార్టీ లపై పోరాటం చేయాల్సిన తీరుపై కూడా ఆ రాష్ట్రం పీసీసీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇవన్నీ భవిష్యత్ లో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేందుకు ఉపయోగపడతాయని టీపీసీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపక్షంగా పోరాటం ఎలా..?
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఆదేశాలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ క్రీయాశీలక పోరాటం చేసింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్(టీఆర్ఎస్) ను ఇరకాటంలో పెట్టేందుకు వివిధ విధానాలు, పద్ధతులను పాటించింది. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని తప్పిదాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించేందుకు వినూత్నమైన నిరసనలు, ఆందోళనలు నిర్వహించింది. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఆధారణ పెరిగేందుకు మాజీ సీఎం కేసీఆర్ పై పెద్ద యుద్దమే చేశారు. రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళా సంఘాల సవాళ్లను ప్రధానంగా ఎత్తుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్ లలో తప్పిదాలు, ప్రాజెక్టుల లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు వంటివన్నీ ప్రజల్లోకి సులువుగా తీసుకువెళ్లగలిగారు. ఇవన్నీ ఓ ప్రణాళిక బద్ధంగా అమలు చేయడంతో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి కాంగ్రెస్ కు వేవ్ మొదలైంది. ఇది మౌత్ పబ్లిసిటీ గా మారి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఊహించని ఆధారణ లభించింది. తద్వారా ప్రస్తుతం పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇక పవర్ లోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఆయన కూడా ఏడాది పాటు పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేఫథ్యంలోనే చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి అంశాలపై గమనంలోకి తీసుకున్నది.
పవర్ లోకి వచ్చేందుకు..?
ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బీజేపీ పవర్ లో ఉన్నది. కేంద్రంలోనూ అదే పార్టీ ఉన్నది. దీంతో ఆ పార్టీపై యుద్ధం ఎలా చేయాలని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పైగా తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పీసీసీ అధ్యక్షుడే ఇప్పుడు సీఎంగా ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ చేయాల్సిన తీరు, అధికార పార్టీల ను ఇబ్బంది పెట్టేందుకు తీసుకోవాల్సిన పాలసీలు, పవర్ పార్టీని డీ మోరల్ చేసేందుకు ఎత్తుకోవాల్సిన అంశాలను చత్తీస్ ఘడ్ పీసీసీ స్పష్టంగా తెలుసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పీసీసీ ఈ విషయంలో సక్సెస్ పుల్ అనే ముద్ర ఉన్నది. దీంతోనే ఛత్తీస్ ఘడ్ పీసీసీ ఈ స్టేట్ పై ఫోకస్ పెట్టారని పార్టీలోకి ఓ కీలక నేత వెల్లడించారు.






