- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Police: చేవెళ్ల బస్సు ప్రమాదం.. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం
వాహనదారులకు డీజీపీ కీలక సూచన

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలపై వచ్చేనెల నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadher Reddy) తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద (Chevella bus accident) బాధితులను ఇవాళ డీజీపీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ బస్సు ప్రమాదం జరిగిందన్నారు. రోడ్డు పరిస్థితిని బట్టి స్పీడ్ నియంత్రణ ఉండాలన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఓఆర్ఆర్, నేషనల్ హైవేలపై హైస్పీడ్ కు అనుమతి ఉందని అక్కడ వాహనాలు నడిపిన డ్రైవర్లు సాధారణ రోడ్లపై కూడా అదే స్పీడ్ తో వెళ్తున్నారని ఇది సరైనది కాదన్నారు. వాహనదారుల అతివిశ్వాసం సరికాదన్నారు.






