- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponnam Prabhakar : చేప ప్రసాదానికి 1.50 లక్షల చేప పిల్లలు సిద్ధం : మంత్రి పొన్నం ప్రకటన
by Muthe.Rajitha |
తెలంగాణలో జూన్ 8న జరగనున్న చేప ప్రసాదం(Chepa Prasadam) పంపిణీ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో జూన్ 8న జరగనున్న చేప ప్రసాదం(Chepa Prasadam) పంపిణీ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రకటించారు. ఈ కార్యక్రమం జూన్ 8న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో(Nampally Exhibhition Ground) జరగనున్న విషయం తెలిసిందే. బత్తిని ఫ్యామిలీ చేత జూన్ 8, 9న నిర్వహించే ఈ కార్యక్రమంలో అస్థమా, శ్వాసకోశ సమస్యలకు చికిత్సగా పేషెంట్లకు చేప ప్రసాదాన్ని మందుగా ఇస్తారు. కాగా నేడు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. చేప ప్రసాదానికి అవసరం అయ్యే 1.50 లక్షల చేపలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story






