- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ బోట్ క్లబ్ అధ్యక్షుడిగా చెన్నాడి సుధాకర్ రావు, కార్యదర్శిగా అమరేందర్ రెడ్డి
నగరంలో 94 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్ బోట్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026 ,28 సంవత్సరాల కాలపరిమితికి గాను బోట్ క్లబ్ అధ్యక్షుడిగా చెన్నాడి సుధాకర్ రావు, కార్యదర్శిగా టీ. అమరేందర్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు.

దిశ,తెలంగాణ బ్యూరో: నగరంలో 94 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్ బోట్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026 ,28 సంవత్సరాల కాలపరిమితికి గాను బోట్ క్లబ్ అధ్యక్షుడిగా చెన్నాడి సుధాకర్ రావు, కార్యదర్శిగా టీ. అమరేందర్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. శనివారం నూతన కార్యవర్గానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వివిధ పోస్టులకు వేరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో, బరిలో నిలిచిన వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎస్.బీ. మధుసూదన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన చెన్నాడి సుధాకర్ రావు..గత 23 ఏళ్లుగా ఆయన హైదరాబాద్ బోట్ క్లబ్‌లో రెండు దశాబ్దాల కాలంలో ఏకంగా 19 ఏళ్ల పాటు క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన, నాలుగేళ్ల పాటు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బోట్ క్లబ్ కార్యవర్గంలో ప్రెసిడెంట్, సెక్రటరీలతో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఏనుగు మురళీధర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సీ.ఏ.బీ. నరేందర్ రావు, కోశాధికారిగా కె. ధరణిధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక క్లబ్ మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఏఎమ్ రాజా, జి. కిరణ్ కుమార్, నికుంజ్ అనిల్, ఎన్. లిఖిత, పివిఆర్ రెడ్డి, శేషగిరిరావు తుమ్మల బాధ్యతలు చేపట్టనున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు, బోట్ క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.






