చిరుత సంచారం కలకలం

by Sathputhe Rajesh |

అటవీ జంతువులు బెడద ఎక్కువై పోతున్న ఘటనలు మనం తరుచూ చూస్తూనే ఉన్నాం.

చిరుత సంచారం కలకలం
X

దిశ, మల్లాపూర్ : అటవీ జంతువులు బెడద ఎక్కువై పోతున్న ఘటనలు మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ , నడికుడ గ్రామాల మార్గ మధ్యలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారునిపై చిరుత దాడికి యత్నించింది. అదే సమయంలో వెనుక వచ్చిన టాటా ఏసీ హారన్ కొట్టడంతో చిరుత పరారైంది. దీంతో ద్విచక్ర వాహనదారుడికి ప్రాణాపాయం తప్పింది. అధికారులు స్పందించి వన్య ప్రాణుల నుంచి ప్రజలను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story