- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒవైసీ బ్రదర్స్‌కు చీకోటి ప్రవీణ్ కౌంటర్! 15 నిమిషాలు టైమిస్తే..
చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఒవైసీ బ్రదర్స్‌పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా జహీరాబాద్ లో జరిగిన శోభాయాత్రలో పాల్గొని మాట్లాడిన చికోటీ ప్రవీణ్.. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వారి తలలు నరుకుతామన్నారు.
గతంలో ఒవైసీ చేసిన '15 నిమిషాలు’ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఒవైసీ శరీరంలోకి బుల్లెట్లు దిగినా ఇంకా బుద్ధి రావడం లేదని, మాకు 15 నిమిషాలు పోలీసులు టైమ్ ఇస్తే తామేంటో చూపిస్తామన్నారు. మీ అంతు చూడటానికి మాకు రెండే నిమిషాలు చాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఒవైసీ సోదరులే టార్గెట్‌గా చీకోటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఎంఐఎం కన్నేసిన స్థానంలో చీకోటి!:
జహీరాబాద్ అసెంబ్లీ స్థానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌కు అక్బరుద్దీన్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంఐఎం పోటీ చేయబోయే స్థానాలపై జరుగుతున్న చర్చల్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం ఒక్కటి. ఇక్కడ మైనార్టీ సామాజిక వర్గం ఓట్లు మెజార్టీ స్థాయిలో ఉన్నాయి.
గెలుపు ఓటములను డిసైడ్ చేయగలిగే బలం మైనార్టీ ఓటర్లకు ఉంది. దీంతో ఇక్కడ తమ అభ్యర్థిని పోటీకి దింపి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది ఒవైసీ బ్రదర్స్ ఆలోచనగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జరిగిన శోభాయాత్రలో చీకోటి ప్రవీణ్ జహీరాబాద్ గడ్డపై హిందూ గళాన్ని వినిపించారనే చర్చ జరుగుతోంది.






