- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా హైదరాబాద్ పార్కింగ్ కష్టాలు తొలగించడానికి నివామ్స్ సంస్థ పీపీటి పద్ధతి లో ఈ బహుళ అంతస్తుల పార్కింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. నాంపల్లి కూడలి జంక్షన్ వద్ద శనివారం హెచ్ఎంఆర్ఎల్, నోవామ్ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన బహుళ అంతస్తుల పార్కింగ్‌ను మంత్రి అజారుద్దీన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు ఎన్వీఎస్.రెడ్డి, ప్రాజెక్ట్ డెవలపర్లు హరి కిషన్ రెడ్డి, భావన రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 15 అంతస్తుల్లో 10 అంతస్తుకు పార్కింగ్ కి మిగిలిన ఫ్లోర్ లలో వ్యాపార సముదాయాలకు వినియోగించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేలా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పార్కింగ్ కేంద్రంలో 200 కార్లు ,200 టూ వీలర్లు పార్కింగ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారని తెలిపారు. మానవ ప్రమేయం లేకుండానే దేశంలోనే మొదటిసారి ఇక్కడ అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో లోపలికి వెళ్ళే వాహనాలు బయటకు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ ఖర్చుతో పార్కింగ్ ఏర్పాటు చేశారని వివరించారు.
50 ఏండ్ల ఒప్పందం..
మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ మల్టీలెవల్ పార్కింగ్ లను వాహనదారులు వినియోగించుకోవాలని అన్నారు. ఎక్కడా షాపింగ్ ఉంటుందో అక్కడే వాహనాలు పార్కింగ్ చేయాలని కాకుండా ఇలాంటి మల్టీలెవల్ పార్కింగ్ ప్రాంతాల్లో చేయాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గడంతోపాటు నడిచి వెళ్లడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు. నాంపల్లిలోని మల్టీలెవల్ పార్కింగ్‌ను నోవమ్ సంస్థతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) 50 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్ఎంఆర్ఎల్ ఇచ్చిన 2 వేల చదరపు గజాల స్థలంలో రూ.102 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ కేంద్రం ద్వారా నాంపల్లి ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది.






