సర్పంచ్ ఎన్నికల వేళ అభ్యర్థులకు కోతుల గండం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-03 07:08:29  IST  )

సర్పంచ్ ఎన్నికల వేళ అభ్యర్థులకు కోతుల గండం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో లోకల్ వార్ మొదలైంది. ఇప్పటకే నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఎన్నికలు వచ్చిందంటే ఒకప్పుడు అభ్యర్థుల వినూత్న ప్రచారాలే కనిపించేవి కానీ ఇప్పుడు ఓటర్లు వినూత్న అభ్యర్థనలు కూడా కనిపిస్తున్నాయి. ఓటు అడిగే ముందు ఈ పనిచేయండి అంటూ ముందుగానే ఓటర్లు తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా రేగొండ మండలంలో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో కోతులను తరిమి ఓట్లు అడిగేందుకు రండి అంటూ ఓటర్లు ముందుగానే అభ్యర్థులకు సూచించారు.

పండిన పంటలు కోతుల చేష్టలతో ఇంటికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పెద్ద సార్లు.. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా పట్టించుకునే నాధుడే లేడని పేర్కొన్నారు. ఎన్నికల వేళ మా గడప తొక్కాలి అంటే ముందు కోతులను తరిమి చిత్తశుద్ధిని చాటుకోండి అంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల మహబూబాబాద్ జిల్లా మచ్చర్ల గ్రామంలోనూ ఇలాంటి పోస్టర్లే దర్శనం ఇవ్వడం విశేషం. ఎన్నికల వేళ ఇలాంటి పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. post

Next Story