శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం! కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక లోపం

by Ramesh Naini |

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఓ విమానంలో టేకాఫ్‌కు ముందు ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తింది.

శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం! కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక లోపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఓ విమానంలో టేకాఫ్‌కు ముందు ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తింది. సకాలంలో స్పందించిన విమాన సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పినట్లైంది. సమాచారం ప్రకారం.. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో బయలుదేరే (టేకాఫ్) ముందే పైలట్లు, సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేశారు. అప్పటికే విమానం ఎక్కిన సుమారు 150 మంది ప్రయాణికులను సిబ్బంది సురక్షితంగా కిందకు దించినట్లు తెలిసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టిన అధికారులు, వారికి సమీప హోటళ్లలో బస సౌకర్యాన్ని కల్పించారు. విమానంలోని సాంకేతిక లోపాన్ని సరిచేసిన అనంతరం తదుపరి ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Next Story